చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రద్దీ కారణంగా ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న కొండ ప్రాంతాల్లో భక్తులు గంటలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది.హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం తెరుచుకున్న మొదటిరోజు నుంచి దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు గంటలతరబడి క్యూలో నిరీక్షిస్తున్నారు.
ఆలయానికి వెళ్లే చిన్న కొండ మార్గంలో ఇరుకైన దారిలోనే 2 గంటలకు పైగా నిల్చున్నామని తెలిపారు. భద్రత, రద్దీ నిర్వహణపై అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదని మండిపడుతున్నారు. ”మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. సహాయం చేయడానికి అధికారులు కూడా అందుబాటులో లేరు.2 గంటలకు పైగా కొండల్లోనే చిక్కుకుపోయాం. చివరికి ఎలాగోలా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాం అని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్షయ తృతీయ సందర్భంగా హిమాలయాల్లోని కేదార్‌నాథ్, గంగోత్రి,యమునోత్రి, బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. దాంతో శుక్రవారం నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో యమునోత్రి, కేదార్‌నాథ్ దేవాలయాల తలుపులు తెరువగా,మధ్యాహ్నం 12.25 గంటలకు యమునోత్రి దేవాలయ తలుపులు తెరుచుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.