స్పైస్ జెట్ కు డీజీసీఏ షాక్.. ‘50% ఫ్లైట్లనే నడపాలని ఆదేశం’

-

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​ జెట్ కు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం ఫ్లైట్లనే నడపాలని ఆదేశించింది. స్పైస్​ జెట్​ విమానాల్లో ఈ మధ్య తరచూ ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడుతుండటమే దీనికి కారణంగా పేర్కొంది.
అంతకుముందు ఈనెల 6న డీజీసీఏ స్పైస్​ జెట్ ​కు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. జూన్​ 19 నుంచి ఎనిమిది సందర్భాల్లో ఆ సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ ఆ మేరకు చర్యలు చేపట్టింది.
“సాంకేతిక సమస్యలను గుర్తించడం, తనిఖీలు, సేఫ్టీ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరో 8 వారాల పాటు స్పైస్​ జెట్​ కేవలం 50 శాతం విమానాలనే నడిపించాలని ఆదేశాలు జారీ చేశాం” అని డీజీసీఏ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version