జగన్ ప్రభుత్వం వచ్చాక సరికొత్త పన్నులు ప్రజలపై భారం పెంచిన విషయం తెలిసిందే..ఎంత కాదు అనుకున్న, గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న…జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం గట్టిగానే పెంచింది. ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తున్నట్లు…బాదుడే..బాదుడు కార్యక్రమాన్ని నిజం చేస్తున్నట్లే కనిపిస్తోంది.
కరోనా వల్ల అసలే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు…ఇలాంటి సమయంలో పన్నులు భారం పెంచడం వల్ల ప్రజలకు కష్టాలు పెరిగాయి..పైగా నెల నెల చెత్త పన్ను కట్టడం భారమైపోతుంది…అద్దెకు ఉన్నవారిపై చెత్త పన్ను భారం ఎక్కువ ఉంటుంది. ఇదే విషయంపై తాజాగా గుడివాడ టౌన్ లో గడప గడపకు వెళ్ళిన మాజీ మంత్రి కొడాలి నానికి వింత అనుభవం ఎదురైంది..గుడివాడలో చెత్త పన్ను కింద నెలకు రూ.90 వసూలు చేస్తున్నారు…ఇది తమకు భారమైపోయిందని, అద్దెకు ఉంటున్నవారు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని స్థానిక ప్రజలు…కొడాలి నాని దృష్టికి తీసుకెళ్లారు.
చెత్త పన్ను వసూళ్లు ఇబ్బందిగా ఉన్నాయని, దీనిపై సీఎంని కలుద్దామని కొడాలి, పేర్నికి వివరించారు. అయితే ఇద్దరు నేతలు…జగన్ కు సన్నిహితులే…మరి వీరి చెబితే జగన్ చెత్త పన్నుపై వెనక్కి తగ్గి..ప్రజలపై భారం తగ్గిస్తారేమో చూడాలి.