చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..డీజీపీ వార్నింగ్..!

-

ఏపీలో టీడీపీ కార్యాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల నేప‌థ్యంలో ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప్ర‌జ‌లను హెచ్చ‌రించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయనం పాటించాల‌ని డీజీపీ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ‌ని డీజీపీ హెచ్చ‌రించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దని…. చ‌ట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చ‌రించారు.

దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలని డీజీపీ కోరారు. ఇదిలా ఉండ‌గా టీడీపీ కార్యాల‌యం పై జ‌రిగిన దాడితో ఒక్క‌సారిగా ఏపీలో క‌ల‌క‌లం రేగింది. చంద్ర‌బాబు ఇప్ప‌టికే కేంద్ర బ‌ల‌గాల‌తో ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కేంద్రాన్ని విన్నవించుకున్నారు. అంతే కాకుండా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా దాడ‌లను ఖండిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version