త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ధమాకా”. ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహనిర్మాత.
ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందింది. ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ- స్క్రీన్ ప్లే- మాటలు అందిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియ బాణీలు సమకూర్చారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా మరో స్పెషల్ మా స్ట్రీట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. 2 నిమిషాల 7 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రవితేజ రెండు పాత్రలని ప్రేమిస్తుంది హీరోయిన్. తనదైన కామెడీ, యాక్షన్ తో ఆకట్టుకున్నాడు రవితేజ.