సోయా చిక్కుడు విత్తడం,కలుపు నివారణ పద్ధతులు..!

-

సొయా చిక్కుడు ఎక్కువగా పండిస్తున్నారు.ఈ పంటను వేసేవారు విత్తనాలను ఎంపిక చేసుకోవడం ముఖ్యం.. మొలక శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన కొత్త విత్తనాన్ని ఎంచుకోవాలి. పాత విత్తనం అయితే మొలక శాతం తక్కువగా ఉంటుంది.ఇలా చెయ్యడం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు… చిక్కుడు విత్తనం వేసుకునేప్పుడు నేల తేమగా ఉన్న సమయంలో విత్తుకోవాలి. దీనివల్ల మొలక శాతం పెరుగుతుంది.

విత్తనాన్ని శుద్ధి చెయ్యడం కోసం 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల తైరం మరియు 3 గ్రాముల కాప్టన్ లను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వీటి వరుసల మధ్య 40 సేమీ దూరం ఉండేలా, 8 సేమీ మొక్కల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తుకున్న 48 గంటల లోపు 1 లీటర్ నీటికి 5 ఎమ్ఎల్ పెండిమిథాలిన్ కలుపుకొని నేల మొత్తం తడిచేలా పిచికారి చేసుకోవాలి. మొక్కలు ఎదుగుతున్న సమయంలో గుంటుక లేదా గోర్రుతో అంతర కృషి ద్వారా కలుపును తొలగించాలి..

పంట చేనులో గొర్రు సాయంతో దున్నడం వలన మొక్క బలంగా తయారవుతుంది. పంట వయస్సు 30 రోజులు ఉన్న సమయంలో ఎకరానికి 15 – 20 కిలోల యూరియాను కూడా వేసుకోవాలి. ఇది వర్షధార పంట..నీటి వాడకం తక్కువగా ఉంటే సరిపోతుంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న సమయంలో పంట వయస్సు 45 – 50 రోజులకి పూత దశలో, గింజ బలపడే సమయం లో నీటిని కచ్చితంగా అందించాలి. భూమి స్వభావాన్ని బట్టి నీటి ఎద్దడి ఇస్తె సరిపోతుంది.. కొంత మంది వీటిలో అంతర్ పంటలను కూడా వేసుకుంటారు.. ఇలా కూడా మంచి లాభాలను పొందొచ్చు.. ఇంకేదైనా సమస్యలు వున్న, మరింత సమాచారం కొరకు వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version