కేజిఎఫ్ 2 రికార్డులు బద్దలు కొట్టేసిన అవతార్ 2..

-

ఒక హాలీవుడ్ చిత్రం మన దేశంలో రికార్డులు తిరగరాసింది అది కూడా రిలీజ్ అవ్వకముందే ఈ మూవీ భారతీయ సినిమాలకు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి..

అవతార్ టు చిత్రం డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూమ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి ఇప్పటికే 13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ చిత్రం వ్యాప్తంగా మంచి హిట్ కాగా ఈ సినిమాపై మరిన్ని హోప్స్ క్రియేట్ అయ్యాయి.. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డ్ ల వేట మొదలు పెట్టింది.. మన తెలుగుతో పాటుగా వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో అవతార్ 2 సినిమారిలీజ్ కాబోతుంది..

రిలీజ్ కు ముందే అవతార్2 బాక్సాఫీస్ కు దడపుట్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు తిరగరాస్తోంది. ఈ క్రమంలనే ఇప్పటి వరకూ కెజియఫ్ పేరు మీద ఉనన అడ్వాన్స్ బుక్కింగ్స్ కలెక్షన్ల రికార్డ్ ను అవతార్ 2 బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ లో టాపర్ గా నిలిచిన కేజీఎఫ్ 2 మూవీ రికార్డు కనుమరుగైపోయింది.. ఇండియాలో కేజీఎఫ్ 2 సినిమాకి 4,11,000 మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ఇది ఇప్పటివరకూ ఆల్ టైమ్ రికార్డు. దాన్ని బ్రేక్ చేసింది అవతార్. అలాగే గతంలో ఎన్నడు లేని విధంగా ఇండియాలో అవతార్ 2 కోసం ఇప్పటికే 4,41,960 మంది అడ్వాన్స్‌ బుకింగ్స్ చేసుకున్నారట. గతంలో ఏ సినిమాకి ఈ స్థాయిలో జరగనంతగా అడ్వాన్స్ బుకింగ్స్ అవతార్ 2 కి జరిగడం విశేషం.. దీంతో ఇండియాలో బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది ఇలా అయితే తర్వాత విడుదల కాబోయే చిత్రాల పరిస్థితి ఏంటి అంటూ నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version