దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు రూ.76వేలకు పైగా పలికిన ధర ఉన్నట్టుండి ధంతేరాస్ ఎఫెక్ట్ కారణంగా రూ.81,400కు బంగారం ధర చేరుకుంది. ఇండియాలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంది. ఏ చిన్న అకేషన్ వచ్చిన బంగారం తీసుకోవడం భారతీయ మహిళలకు ఆనవాయితీగా మారింది. అలా చేస్తే లక్ష్మీదేవి కరుణకటాక్షాలు ఉంటాయని ఇక్కడి మహిళలు నమ్ముతుంటారు. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నా దేశంలో డిమాండ్ తగ్గడం లేదు.
ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి ఏకంగా లక్ష కిలోల బంగారాన్ని భారత సర్కార్ గుట్టు చప్పుడు కాకుండా దేశానికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. మే 31న 100 టన్నుల బంగారాన్ని నాగ్‌పూర్‌కు కేంద్రం తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఓఈ, బీఐఎస్ వద్ద 324 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.