యాక్టర్లతో తిరిగి కేటీఆర్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడు : ధర్మపురి అరవింద్

-

సినిమా యాక్టర్లతో తిరిగి కేటీఆర్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడని నిజామాబాద్ లోక్ సభ ఎంపీ ధర్మపురి అరవింద్ చుర‌క‌లు అంటించారు. తీవ్రమైన తరుగు పేరుతో గత మూడు సంవత్సరాల నుంచి రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని.. మిల్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థతో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడు? అని నిల‌దీశారు. గత మార్చి 14 నుండి భైంసాలో హిందువులపై ఎంఐఎం పార్టీ దాడులు జరిపారని… నలుగురు హిందూ వ్యక్తులను చంచల్ గూడా జైళ్ లో పీడీ యాక్ట్ పెట్టి నిర్భంధించారని మండిప‌డ్డారు.

ఆస్తులు ధ్వంసం అయిన వారి పై అన్యాయంగా ఓవైసీ చెప్పిన ప్రకారం కేసులు పెట్టారని… ఆయన రాజ్యం ఏలుతున్నారని మండిప‌డ్డారు. ధ్వంసం చేసిన వారిని వదిలిపెడుతున్నార‌న్నారు. 9 నెలలుగా జైళ్లలో నిర్భందించి వేధిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యుల భాధలు అమిత్ షా కు వివరించానని తెలిపారు.

తెలంగాణలో తరుగు పేరుతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోచుకుంటుంటే ఒక్క శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు మాట్లాడడం లేదని నిప్పులు చెరిగారు. బ్లాక్ మార్కెటింగ్ తో సంబంధం లేకపోతే… రైతులకు అన్యాయం చేస్తుంటే కేటీఆర్‌ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో వేసంగి పంటకు బోనస్ ఇస్తుంటే … తెలంగాణ లో ఎందుకు ఇవ్వడంలేదని ప్ర‌శ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version