జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..ఆ జీఓ ఉప‌సంహ‌ర‌ణ

-

జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ కార్య దర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తు జారీ చేసిన జీఓ నెంబరు 59ని ఉపసంహరించుకుంటామని హై కోర్టు కు తెలిపింది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం. మహిళ కానిస్టేబుళ్లు గా మారుస్తు జారీ చేసిన జీఓను సవాల్‌ చేస్తూ హై కోర్టు లో పలువురు పిటీషన్లు చేశారు. అయితే.. ఇవాళ ఏపీ హై కోర్టు లో ఈ పిటీష‌న్ల పై విచార‌ణ జ‌రిగింది.

అయితే… పిటీషనర్ల తరపున వాదనలు ఈ సంద‌ర్భంగా వినిపించారు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌. గ్రామ కార్య దర్శులకు కానిస్టేబుళ్లుగా మార్చి వారికి పోలీసు డ్రస్‌ ఇవ్వడం పై అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది…. జీఓని ఉపసంహరించి వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. ఏపీ ప్ర‌భుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version