లంచం తీసుకుంటూ ఏసీబీకి ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన వ్యక్తిని ఓ కేసు నుంచి తప్పించేందుకు రూ.70 వేలు లంచం అడిగినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే సదరు వ్యక్తి నుంచి ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకున్నారు. గతంలో తాండూర్ పట్టణ ఎస్సైగా వేణుగోపాల్ గౌడ్ విధులు నిర్వహించినట్లు సమాచారం. అనంతరం ఎస్సైను విచారణ తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిసింది.
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుండి తప్పించేందుకు రూ.70 వేలు లంచం అడిగిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలలో చిక్కిన ఎస్సై… pic.twitter.com/pKhEAiqGil
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025