సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ధోనీ

-

ఐపీఎల్ టీ 20 ఫార్మట్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన గేమ్. భారీగా పారితోషికం వస్తుండటంతో ప్రపంచ క్రికెటర్లు ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకూ 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌లో చెన్నై సారధి మహేంద్రసింగ్ ధోనీ ఒక గొప్ప కాని రికార్డు నెలకొల్పనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పైనల్ పోరు ఇవాళ మరి కాస్సేపట్లో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించనున్నాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఆడటం ద్వారా ధోని ఐపీఎల్‌లో 250 మ్యాచులు పూర్తి చేసుకోనున్నాడు. దీంతో 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (243), దినేశ్ కార్తీక్ (242), విరాట్ కోహ్లీ (237), రవీంద్ర జడేజా (225) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోని ఒకరు. సారథిగా చెన్నై జట్టును 9 సార్లు ఫైనల్ చేర్చిన ధోని, నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. అతని కెప్టెన్సీలోనే చెన్నై 2010, 2011, 2018, 2021 సీజన్లలో విజేతగా నిలిచింది

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version