క్రికెటర్ పెళ్లి కోసం చాలా కష్టపడిన ధోనీ…!

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిజ జీవితంలో కూడా ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటాడు. తన జీవితంలో ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉండే ధోని కొందరికి మాత్రం చాలా సన్నిహితుడు. చాలా మందికి అతను ఒక గురువు కూడా. తాజాగా ధోని గొప్పతనాన్ని ఒక దేశవాళి క్రికెటర్ పంచుకున్నాడు. తన పెళ్ళికి రావడానికి ధోని ఎంత కష్ట పడ్డాడు అనేది అతను ఈ సందర్భంగా వివరించాడు.

తన వివాహం డిసెంబర్ 2016 లో జరిగిందని… తాను మహీ భాయ్‌ను ఆహ్వానించానని చెప్పుకొచ్చాడు. అతను వస్తాడో లేదో నాకు చెప్పలేదని… అతను న్యూయార్క్ వెళ్లవలసిన అవసరం ఉందని చెప్పాడని పేర్కొన్నాడు. కాని అతను నా పెళ్లికి వచ్చి నన్ను ఆశ్చర్యపరిచాడు. అది నాకు మరపురాని క్షణం అని గుర్తు చేసుకున్నాడు. రాంచీ నుండి ఢిల్లీ అక్కడి నుండి అమృత్సర్ వరకు మూడు వేర్వేరు విమానాలలో అతను వచ్చాడని గుర్తు చేసుకున్నాడు.

ఆ తరువాత కఠినమైన పొగమంచులో రెండు గంటల ప్రయాణం చేయవలసి వచ్చిందని… మరియు ఆ సమయంలో చలి అధికంగా ఉందని చెప్పుకొచ్చాడు. నేను అతనితో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ అతను నా పెళ్ళికి రావడానికి చాలా ప్రయత్నం చేశాడని గుర్తు చేసుకున్నాడు. ఇది అతని గొప్పతనమని అతను వివరించాడు. ఇషాంత్ శర్మ, సురేష్ రైనా కూడా వచ్చారని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version