ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు వృద్ధులలోనే కనిపించే ఈ సమస్య, ఇప్పుడు జీవనశైలి మార్పుల కారణంగా చిన్న వయసు వారికీ వస్తోంది. అయితే డయాబెటిస్‌ను కేవలం మందులతోనే కాకుండా మన ఇంట్లో దొరికే సాధారణ పదార్థాలతో కూడా సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా సహజసిద్ధమైన చికిత్సలు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే మీ వంటింటి నిధి నుంచి కొన్ని ఔషధ గుణాలున్న పదార్థాలను ఉపయోగించి మధుమేహాన్ని నియంత్రించే సులభమైన గృహ చిట్కాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఈ చిట్కాలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ..
డయాబెటిస్‌కు ఇంటి చికిత్స: వంటింటి పదార్థాలతో కంట్రోల్ చేసుకోవచ్చు అన్నటున్నారు నిపుణులు. డయాబెటిస్‌ను నియంత్రించడంలో ఆహారం, జీవనశైలి మార్పులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలు అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. అవేంటంటే ముందుగా మెంతులు. మెంతులలో పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను ఆలస్యం చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగకుండా ఆపుతుంది.
రాత్రిపూట ఒక టీస్పూన్ మెంతులను నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం మరియు మెంతులను తినడం వలన చక్కెర నియంత్రణలో ఉంటుంది. తర్వాత కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ దీని రసం చరంటిన్ మరియు పాలిపెప్టైడ్-పి వంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో మరియు ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడతాయి.

ప్రతిరోజూ ఉదయం తెసుకోవాల్సినవి : ఉదయం కాకరకాయ రసం తాగడం మంచిది. అలాగే వేప మరియు కరివేపాకు కూడా చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజు కొన్ని వేపాకులు లేదా కరివేపాకులను నమలడం వలన వాటిలోని గుణాలు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి దోహదపడతాయి. ముఖ్యంగా మొత్తం చికిత్సలో నీరు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజుకు తగినంత నీరు తాగడం వలన శరీరంలోని టాక్సిన్స్ (విషపదార్థాలు) బయటకు వెళ్లి చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఈ గృహ చిట్కాలతో పాటు తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం అలాగే నిత్యం వ్యాయామం చేయడం తప్పనిసరి. ఈ సహజసిద్ధమైన పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే మీ డయాబెటిస్ నియంత్రణకు బలమైన పునాది అవుతాయి.
గమనిక: పైన ఇచ్చిన గృహ చిట్కాలు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. మీరు ఇప్పటికే మందులు వాడుతున్నట్లయితే ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యులు లేదా ఆయుర్వేద నిపుణుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.