ఇప్పటి రాజకీయాలకు ఒకప్పటి రాజకీయాలకు చాలా అంటే చాలా తేడా! స్వశక్తిని నమ్ముకుని ఎదిగిన నాయకుల స్థానంలో కొత్త కొత్త పోటుగాళ్లు ఎంటర్ అవుతూ వస్తున్నారు. వాళ్లు తప్పు చెప్పినా, ఒప్పు చెప్పినా ఆ పండుగాళ్లే లీడర్లు. వాళ్లే రూలర్లు కూడా! అందుకే రాజకీయాల్లో పెద్ద పెద్ద పార్టీలకు కూడా వ్యూహకర్తలు అంటూ తెరపైకి వస్తూ ఉన్న ఆ కాస్త మంచి పేరునుకూడా చెడగొడుతున్నారు.కొన్ని సార్లు ఆచరణ సాధ్యం కాని స్ట్రాటజీతో వీరంతా చెప్పే సూచనలు లేదా సలహాలు నాయకుల కొంపలు సైతం ముంచుతున్నాయి.
రాజకీయాల్లో దెబ్బకొట్టడం, దెబ్బకొట్టాక విలవిలలాడుతూ బాధపడిపోవడం వెరీ కామన్. కనుక పండుగాడు ఎవడు పోటు గాడు ఎవడు అన్న డిస్కషన్ అయితే వద్దు.పండు గాడు మరియు పోటు గాడు ఇప్పటి రాజకీయాల్లో ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు.రాజకీయాల్లో విభేదాలు ఎన్ని ఉన్నా అందరు నాయకులూ ఓ చోట చేరి హాయిగా నవ్వుకుంటారు. ఆ విధంగా పండుగాడి దెబ్బకు మిగతా వాళ్లంతా విలవిలలాడిపోతుంటారు. రాజకీయాల్లోనే కాదు ఉద్యోగ సంఘాల్లోనూ పండుగాడు మరియు పోటుగాడు ఉంటారు.వాళ్లు డైలాగులు చెబుతుంటే మిగతా వాళ్లంతా చప్పట్లు కొడుతుంటారు.
ప్రధాన పార్టీలన్నీ పండుగాడి రాక కోసమే ఎదురు చూస్తుంటాయి.వాడేదో వచ్చి ఉద్ధరిస్తాడని.ఆ విధంగా పండుగాడు మరియు పోటుగాడు ప్రతి పార్టీకి ఓ వ్యూహకర్త అయి ఉంటాడు.ఆ పండుగాడు మరియు పోటుగాడు ఏం చెబితే అదే వర్థిల్లుతుంది. అందుకు కారణాలేవయినా కూడా అవే గొప్ప గొప్ప పథకాలుగా చెలామణి అవుతుంటాయి.రాజకీయాల్లో ఇలాంటి పండుగాడు మరియు పోటుగాడు ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటారు.వాళ్లు చాలా చాలా అబద్ధాలు చెప్పి అధినాయకత్వాలను తమ దారికి తెచ్చుకునే పనులేవో చేస్తుంటారు.ఆ విధంగా పండుగాడు మరియు పోటుగాడు ఎప్పటికీ మీడియాలో ఫేమస్ అవుతూనే ఉంటారు.
రాజకీయాల్లో పండుగాడు మరియు పోటుగాడు కారణంగా కొత్త యుద్ధాలు కూడా వస్తుంటాయి.కొత్త నిర్ణయాలు కూడా వెలుగు చూస్తాయి.అయినా కూడా మనం వాటిని విని,చూసి,నవ్వి ఊరుకోవాలి.ఏం కాదు ప్రధాన పార్టీలన్నింటికీ ఏదో ఒక నిర్ణయం చెప్పేవాడు కావాలి. ఏదో ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించగలిగే వాడు కావాలి.కొడితే ఎలా ఉండాలో తెలుసా దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే! ఆ స్థాయిలో పండుగాడి పంచ్ లు ఉండాలన్న మాట. కనుక పండుగాడు మరియు పోటుగాడు అన్ని పార్టీలకూ వెళ్తుంటాడు.
అదే పనిగా సలహాలు కూడా ఇస్తుంటాడు. పొరపాటున అవి వర్కౌట్ అయితే చాలు ఇక మనోడికి ఎదురే ఉండదు. కనుక రాజకీయాల్లో పండుగాడు మరియు పోటుగాడు పథకాలను నిర్దేశిస్తాడు.అధికారులను శాసిస్తాడు. వచ్చే ఎన్నికల్లో తనను నమ్ముకున్న పార్టీ నిండా మునిగితే,గెలిచిన పార్టీకి చెంతకు పోయి రాజకీయం నడుపుతాడు. కనుక ఉప్పర్ మీటింగులు మానేసి రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహం వారు స్వతంత్ర రీతిలో అమలుచేస్తే చాలు.పండుగాళ్లకు మరియు పోటుగాళ్లకు ఇక పని లేకుండా పోతుంది.