తిరుమల అభిషేక టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన దళారి అరెస్ట్‌ !

-

తిరుమల అభిషేక టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన దళారి అరెస్ట్‌ అయ్యారు. తిరుమల శ్రీవారి అభిషేక టిక్కెట్లు ఇప్పిస్తానని భక్తులను మోసం చేసిన దళారిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిజామాబాద్ కు చెందిన సాయి చంద్ అనే భక్తుడు వద్ద అభిషేకం టిక్కెట్ల పేరుతో లక్షా 5 వేలు వసూలు చేశాడు దళారి లలిత్. టిక్కెట్లు ఇప్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాయి చంద్.

A broker who cheated to give Tirumala Abhishek tickets was arrested

దీంతో దళారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. టిటిడి ఉద్యోగిని అంటూ భక్తులను మోసం చేస్తూన్నాడట లలిత్. 2022-23 సంవత్సరంలోనే భక్తుల నుంచి 70 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే లలిత్ పై తిరుమల టూటౌన్ లో 6 కేసులు, చీరాలలో ఒక కేసు నమోదు అయింది. లలిత్ బ్యాంక్ అకౌంట్లు ప్రిజ్ చేసిన పోలీసులు…విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version