రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏ రోజుకు ఆ రోజే.. వీలైతే 2 గంటల్లోనే అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. 93 శాతం రైతులకు 24 గంటల లోపు డబ్బు చెల్లిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు.
దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో అందడంతో రైతులు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. దళారీల ముసుగులో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.
ఇక ఏపీలో తాజా పరిణామాలు, మంత్రుల పనితీరు, ఇతర అంశాలపై మాట్లాడిన చంద్రబాబు.. పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు టెక్నాలజీని సరిగ్గా వాడుకోవడం లేదని అన్నారు. మంత్రి దగ్గరికి ఏదైనా ఫైల్ వెళితే అది ఎంత సేపు పెండింగ్ లో ఉంటుందో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. అంతేకాదు మంత్రుల పనితీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వారికి తెలిపారు.