మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందండి
మీరంతా దీవెనలు ఇవ్వండి
అని పొంగిపోయారు రాము
యువ ఎంపీ రాము..
ఆడబిడ్డల రాక ఆయనకు ఓ సెంటిమెంట్
ఆ ఇంటికే ఓ హిట్ సెంటిమెంట్
శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంట ఓ మంచి సెంటిమెంట్ ఉంది.. ఇంకా చెప్పాలంటే హిట్ సెంటిమెంట్. ఆ ఇంట ఆడపిల్ల నడయాడిన వేళ గొప్ప అదృష్టం అని భావిస్తారు. ఆ ఇంటికి అప్పటి నుంచి ఉన్న కష్టాలు తొలగి మంచి భావనలు కలిగించే మంచి రోజులు వస్తాయని భావిస్తారు. యువ ఎంపీ రామూ ఆడ బిడ్డలను ఎంతో గౌరవిస్తారు. విద్యా సంస్థల్లో బిడ్డల ఎదుగుదలను, వాళ్ల చదువును ఎంతగానో ప్రేమిస్తారు. ఆయన ఏ విద్యా సంస్థకు పోయినా అన్నయ్యా అంటూ ఎంతో మంది చెల్లాయిలు వచ్చి పలకరించి వెళ్తారు. రామూ ఇప్పుడు మరో ఆడబిడ్డ తండ్రి. నిన్నటి వేళ ఆయన తన బిడ్డ బర్త్ డే వేడుకలు చేశారు. బుజ్జితల్లికి దీవెనలు అందించాలని భగవంతుడ్ని ప్రార్థించారు.
రామూ సర్ ఇంట మరో ఆడబిడ్డ ఉన్నారు. ఆమె ఆదిరెడ్డి భవాని. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అని రాయాలి. ఆమె కూడా ఆ ఇంటి హిట్ సెంటిమెంట్. రామూ సర్ కన్నా ముందు పుట్టిన బిడ్డ ఆమె. ఎర్రన్నాయుడి దంపతులకు గారాల పట్టి. ఇప్పటికి కూడా నలుగురు అన్నదమ్ములకు ఆ బిడ్డే గారాల పట్టి.అచ్చెన్న కానీ రామూ కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఆమెను ఎంత బాగా చూసుకుంటారో! ఆమె రాజమండ్రి నుంచి నిమ్మాడ చేరుకుంటే చాలు ఎంత ఆనందంగా స్వాగతిస్తారో!
ఆ ఇంట ఆ ఆడబిడ్డ హిట్ సెంటిమెంట్. ఎర్రన్న తన వాహనాలన్నింటిపైనా భవాని అన్న పేరును రాయించారు. ఆ తల్లి రూపం తన బిడ్డే అని పొంగిపోయారు. విజయమ్మ (రాము మాతృమూర్తి)కు ఇప్పటికీ ఆ బిడ్డ అంటే ఎంతో అపురూపం. తల్లిని మించి దైవం ఉంటుందా అని రామూ అంటుంటారు.తన జీవితాన్ని నాన్న దిద్దారు.అమ్మ నడవడి నేర్పారు.అక్క అన్నీ తానై ఉంటారు. తనతో పోటీ పడి చదివే రోజులను స్మరించుకుంటూ నవ్వులు చిందిస్తారు.
రామూ.. బిడ్డలను ప్రేమిస్తారు. ఎవరు కష్టం అని వచ్చినా చలించి పోతారు. రామూ నిన్నటి వేళ ఓ మంచి పని చేశారు.శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొందరు ఔత్సాహికులు నిర్మించిన మహ్మాతుని కోవెలకు అనుబంధంగా ఒక గ్రంథాలయాన్ని మంజూరు చేశారు.
నిన్నటి వేళ ఆ ఆలయం ప్రారంభోత్సవం. నేను రాలేకపోయాను గాంధీ ఆలయ ప్రారంభోత్సవానికి అని చెబుతూ మిగిలిన పాలకుల కన్నా భిన్నంగా ఆలోచించి,అందరికీ మాట ఇచ్చారు. ఎమ్మెల్యే ధర్మాన అన్నారు ఆచరించి చూపడమే గాంధేయం అని.. ఆ మాటను నిలబెట్టారు ఎర్రన్న బిడ్డ రాము.ఆ విధంగా తన బిడ్డ పుట్టిన్రోజు వేడుకల సందర్భంగా శ్రీకాకుళ నగర వాసులకు కానుక ఇచ్చారు.
యువ ఎంపీ రామూ ఎవ్వరు తన సాయం కోరి వచ్చినా స్పందిస్తారు. ఆ విధంగా తిరుపతిలో గదులు కేటాయింపు జరగక అవస్థ పడుతున్న ఓ వైదిక కుటుంబ సమస్యను అర్ధరాత్రి వేళ పరిష్కరించి వారికి స్వామిదర్శన భాగ్యం కల్పించారు. రాము మనమేం చెప్పినా వింటారు. ఆడ బిడ్డలను ప్రేమించే రాము.. ఇవాళ మరో ఆడబిడ్డ కు తండ్రి.. బిడ్డ పుట్టిన వేళ ఎంతగా ఒత్తిడి చెందారో!
ఆ రోజు అంత ఒత్తిడి లోనూ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చి, తన జీవన సహచరి ఉన్న ఆస్పత్రికి వెళ్లారు.రాము మంచి బిడ్డ అనేందుకు ఇంతకుమించిన ఉదాహరణ ఏముందని..శివాంకృతి తన బిడ్డ పేరు. పూర్తి పేరు : కింజరాపు మిహిర అన్వి శివాంకృతి. ఆ బిడ్డకు దీవెనలు..పుట్టిన్రోజున జేజేలు..
– రత్నకిశోర్ శంభుమహంతి
– చిత్ర కథంబం – మనలోకం ప్రత్యేకం