డైలాగ్ ఆఫ్ ద డే : జబర్ డస్ట్ మానేస్తారా రోజా గారూ !

-

ఇవాళ రామ న‌వ‌మి త‌రువాత ద‌శ‌మి రోజున చాలా మంది ద‌శ తిరిగిపోయింది. ఇప్ప‌టిదాకా కాదు కాదు అనుకున్న‌వ‌న్నీ అవును అయి తీరుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ని తిట్టిపోసే నాయ‌కుల‌కు ఇవాళ పండుగే పండుగ. ఎందుకంటే ఆ రోజు చంద్ర‌బాబు విధేయురాలిగా ఉన్న రోజా కానీ విడుద‌ల ర‌జ‌నీ కానీ ఇవాళ వైసీపీలో ప‌ద‌వులు అందుకోవ‌డ‌మే విడ్డూరం.

ఇంకా చెప్పాలంటే త‌న‌ను అసెంబ్లీలోనే అడుగు పెట్ట‌నివ్వ‌నని చంద్ర‌బాబు శ‌ప‌థం చేశార‌ని కానీ జ‌గ‌న‌న్న చొర‌వ‌తో రెండు సార్లు ఎమ్మెల్యే అయి శాస‌న స‌భ‌లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించాన‌ని, వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని  అంటున్నారామె. ఏదేమ‌యినా ఎట్ట‌కేల‌కు దేవుడు క‌రుణించి రోజ‌మ్మ‌ను మంత్రిని చేయ‌డం విశేషంలో కెల్లా విశేషం. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబును తిట్ట‌డం మానుకుని, పెద్దిరెడ్డి తో గొడ‌వ పెట్టుకోవ‌డం మానుకుని బుద్ధిగా ఆమె ఉంటార‌ని అనుకోవ‌డం అత్యాశ. అయినా స‌రే ఆశ ప‌డ‌డం త‌ప్పు కాదు.ఈ త‌రుణంలో ప్రముఖ న‌టి, న‌గ‌రి ఎమ్మెల్యే, తాజా మంత్రి అయిన రోజా సెల్వ‌మ‌ణి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లోనూ సినిమా వ‌ర్గాల్లోనూ సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేస్తోంది. అదేంటంటే ఇక‌పై తాను టీవీ షోల‌కు కానీ షూటింగ్‌ల‌కు కానీ వెళ్ల‌న‌ని అన్నారామె. ముఖ్య‌మంత్రి త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు ప‌రిపూర్ణంగా నిర్వ‌ర్తించి, మంచి పేరు తెచ్చుకుంటాన‌ని చెబుతున్నారామె.

ఎప్ప‌టి నుంచో ఆమెను జ‌బ‌ర్ద‌స్త్ తో స‌హా ప‌లు టెలివిజ‌న్ షోలు హోస్ట్ చేస్తూ వ‌స్తున్నారామె. వీటిలో కొన్ని చోట్ల అస‌భ్య‌క‌ర రీతిలో మాట‌లు వ‌చ్చినా ఆమె విర‌గ‌బ‌డి న‌వ్వి న‌వ్వుల పాల‌య్యారు.ఈ క్ర‌మంలో ఆమెను టెలివిజ‌న్ షోలు మానేయ్యాల‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పి చూశారు కూడా! ఆర్థిక ప‌రిస్థితి రీత్యా చేయాల్సి వ‌స్తోంద‌ని, త‌న‌కు అప్పులు ఉన్నాయ‌ని వాటిని తీర్చేందుకు షోలు చేయ‌క త‌ప్ప‌ద‌ని అప్ప‌ట్లో రోజా వాద‌న గా ఉండేద‌ని తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు తెలియ‌కున్నా వైసీపీ శ్రేణులు మాత్రం రోజా విష‌య‌మై గుర్రుగానే ఉన్నాయి. టెలివిజ‌న్ షోల కార‌ణంగానే ఆమె న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటూ, ఇక్క‌డికి చుట్ట‌పు చూపులా వ‌చ్చి వెళ్తున్నార‌ని, అస‌లు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆమె ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి.ఇక ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం రెండు జిల్లాల‌కు సంబంధించి ఉంది. కొంత భాగం చిత్తూరు కొత్త భాగం తిరుప‌తి జిల్లాలో ఉంది.క‌నుక ఆమె ఇప్పుడు రెండు జిల్లాల‌కు చెందిన మంత్రి. ఇక‌పై ఇంకా బాగా ప‌నిచేయాల్సి ఉంది. కానీ ఆమెను త‌న ప‌ని తాను చేసుకునేలా నారాయ‌ణ స్వామి కానీ పెద్ది రెడ్డి కానీ స‌హ‌కరిస్తారా లేదా అన్న‌దే పెద్ద సందేహం.

Read more RELATED
Recommended to you

Exit mobile version