విజయ్‌ని ‘అర్జున్‌ రెడ్డి’గానే చూస్తోన్న జనాలు

-

హీరోలకి ఫ్యాన్స్ పాలాభిషేకం చెయ్యడం చాలా కామన్. నోట్ల దండలు, భారీ కటౌట్లు పెట్టడం ఇంకా కామన్. కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానాన్ని వింతగా చూపించారు. ‘లైగర్’కి బీరాభిషేకం చేశారు. ఆల్కాహాల్‌తో అభిషేకం చేయించుకున్న రేర్‌ హీరోగా రౌడీకి స్పెషల్‌ ఇమేజ్ కట్టబెట్టారు అభిమానులు.

మహేశ్ బాబు చెప్పిన ఈ డైలాగ్‌ని యాజ్‌టీజ్‌గా దింపేశారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. ఈ హీరో ఎంత యూనిక్‌గా ఉండాలని ట్రై చేస్తాడో, అతని ఫ్యాన్స్‌ కూడా తమ అభిమానాన్ని అంతే డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. విజయ్‌ని ‘అర్జున్ రెడ్డి’లా ట్రీట్ చేస్తూ ఈ హీరోకి బీరాభిషేకాలు చేశారు.

విజయ్ దేవరకొండ కెరీర్‌పై ‘అర్జున్‌ రెడ్డి’ ప్రభావం ఎంతుందో, అతని ఫ్యాన్స్‌పైనా అంతే ప్రభావం ఉంది. అందుకే ‘అర్జున్‌రెడ్డి’లో ఎప్పుడూ ఆల్కాహాల్‌తో కనిపించే రౌడీని ఇదే ఆల్కాహాల్‌తో గౌరవిస్తున్నారు. విజయ్ సినిమా పోస్టర్లని ఆల్కాహాల్‌తో తడిపేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ‘లైగర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని బీర్లతో అభిషేకించారు అభిమానులు.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. లయన్, టైగర్‌ల క్రాస్‌ బ్రీడ్ ‘లైగర్’ అనే కాన్పెప్ట్‌తో ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు పూరీ. ఈ డిఫరెంట్‌ థాట్‌ని అభిమానులు కూడా ఇదే లెవల్‌లో రిసీవ్‌ చేసుకున్నారు. విజయ్‌ పోస్టర్‌ని బీర్లల్లో ముంచేశారు. మరి పోస్టర్‌తోనే అభిమానుల చేతుల్లోకి బీరు బాటిల్‌ తీసుకొచ్చిన ‘లైగర్’, థియేటర్లలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version