ఏ చర్చ మొదలైన అది సోషల్ మీడియాలోనే మొదలవుతుంది. ప్రస్తుతం గొడవలన్నీ సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. మనుషులు కలవడం తగ్గిపోవడంతో సోషల్ మీడియానే రణరంగంగా మార్చేస్తున్నారు. ఈ మేరకు పరుష పదజాలం వాడి అవతలి వారిని ఇబ్బంది పెట్టడాలు ఎక్కువైపోయాయి. ఐతే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు సహించబోమని, వాటిని నిలువరించాలని సోషల్ మీడియా సంస్థలు బాగా ప్రయత్నిస్తున్నాయి. అందులో సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తుంది మాత్రం ట్విట్టర్ అని చెప్పుకోవచ్చు.
తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఖాతాని సస్పెండ్ చేసిన ట్విట్టర్, ఈ సారి చైనా ఎంబసీకి గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉన్న చైనా ఎంబసీ ట్విట్టర్ ఖాత నుండి వెలువడిన పోస్ట్, ఎంబసీ ఖాతాని సస్పెండ్ చేసేలా చేసింది. ఉగర్ మహిళలు బేబీ మేకింగ్ మెషిన్లు కాదని ఎంబసీ ట్వీట్ చేయగా, అది ఒక జాతిపై వివక్ష చూపించే విధంగా ఉందని ఎంబసీ ఖాతాని సస్పెండ్ చేసింది.