పవన్ కళ్యాణ్ మాజీ భార్య రెండో పెళ్లి చేసుకుందిగా..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రది సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన బెంగాలీ బ్యూటీ రేణు దేశాయి, ఆ తరువాత పవన్‌ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమజీవితం కొనసాగించిన వారిద్దరు, పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట ఆ తర్వాత అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ మరో విదేశీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. రేణు దేశాయ్ మాత్రం అఖీరా, ఆధ్యల బాగోగులు దగ్గరుండి చూసుకుంటుంది. అయితే తన, తన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆమె కూడా మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇది వరకే తెలిపింది. ఈ క్రమంలో రేణూ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ టైములో పవన్ ఫ్యాన్స్ ఆమెను విమర్శించినా ఆమె లెక్క చెయ్యలేదు. ‘కళ్యాణ్ గారు మరో పెళ్ళి చేసుకుంటే తప్పులేదు.. కానీ నేను మరో పెళ్ళి చేసుకుంటే తప్పు వచ్చిందా?’ అంటూ గట్టి కౌంటర్లు ఇచ్చింది. అయితే ఈమెతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి ఫోటోని మాత్రం రివీల్ చెయ్యలేదు. ఇదిలా ఉంటే.. ఈ లాక్ డౌన్ టైములో రేణు దేశాయ్ కూడా సీక్రెట్ గా రెండో పెళ్ళి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. రేణు గతకొద్ది రోజులుగా మెడలో ఓ నల్లపూసల దండను ధరించి ఉండటంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందా అనే సందేహం అందరిలో మొదలైంది. మరి రేణు వివాహ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఆమె నోరు విప్పాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version