జీవితంలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పోటీ పరీక్షలు రాశారా? – కేటీఆర్

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఒక వ్యక్తి తప్పిదం వల్ల జరిగిన పేపర్ లీక్ వ్యవహారాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని.. అసలు జీవితంలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పోటీ పరీక్షలు రాశారా? అని ఎద్దేవా చేశారు. గుజరాత్ లో 13 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, అప్పుడు ఏం చేశారని మండిపడ్డారు.

దేశాన్ని తన దోస్తులకు ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోడీకి సిగ్గు లేదని అన్నారు. ఆయన అదానీ కోసం ఎంతకైనా తెగిస్తారని, స్వదేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న అదాని కోసం విదేశాలలో ఉన్న బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. దీన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వ్యతిరేకించారని తెలిపారు. బిజెపి తెలంగాణను ఓ శత్రువులా చూస్తుందన్నారు. తెలంగాణలోని గ్రామాలలో జరిగిన అభివృద్ధికి కేంద్రం అవార్డులు ఇస్తూనే.. 1200 కోట్లను ఇవ్వకుండా నొక్కేస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version