పురుషుల శరీర భాగాల్లో..ఎక్కడ బల్లి పడితే శుభం జరుగుతుంది..?

-

హిందు సంప్రదాయంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.. స్వప్న శాస్త్రం మన కలలకు అర్థాన్ని చెప్తుంది, శకున శాస్త్రం.. మనకు శకునాలను వివరిస్తుంది..అలాగే బల్లి శాస్త్రం కూడా.. బల్లి మనిషి మీద ఎక్కడ పడితే వాటి వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్‌గా ఉంది. అందులోనూ పురుషులకు అయితే ఒకలా, స్త్రీలకు అయితే ఇంకోలా ఉంది.. బల్లి మీద పడితే..అస్సలు లైట్‌ తీసుకోకండి.. అది జస్ట్‌ మన మీద పడుతుంది..మనం పెద్ద డైనోసార్‌ వచ్చినట్లు గట్టిగా అరుస్తాం.. ఆ అరుపుకు అది పారిపోతుంది. ఇదంతా సెకన్లలో జరుగుతుంది. కానీ మీ మీద బల్లి ఎక్కడ పడిందో దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. పురుషుల మీద బ‌ల్లి ప‌డిన‌ప్పుడు క‌లిగే ఫ‌లితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల త‌ల మీద బ‌ల్లి ప‌డితే ఎదుటి వారితో క‌ల‌హాలు అవుతాయ‌ని అలాగే మృత్యు భ‌యాలు వెంట‌డతాయ‌ని బ‌ల్లిశాస్త్రం తెలియ‌జేస్తోంది.
అలాగే నుదుటి మీద బ‌ల్లి ప‌డితే దూరంగా ఉండే బంధువుల నుండి కీడు వార్త వింటారు.
ఒక‌వేళ బ‌ల్లి క‌నుక పురుషుల ముఖం మీద ప‌డిన‌ట్ట‌యితే ఆక‌స్మిక ధ‌న లాభం క‌లుగుతుంద‌ని బ‌ల్లిశాస్త్రం చెబుతోంది.
అదే విధంగా బల్లి కుడి క‌న్ను పై ప‌డితే అప‌జ‌యాలు క‌లుగుతాయి.
ఎడ‌మ క‌న్ను మీద ప‌డితే శుభం క‌లుగుతుంది.
బ‌ల్లి గ‌నుక కుడి చెవి మీద ప‌డితే దుఖం వెంటాడుతుంది.
ఎడ‌మ చెవి మీద ప‌డితే ఆదాయం బాగా వ‌స్తుంది.
ముక్కు మీద బ‌ల్లిప‌డితే అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతాయి.
పురుషుల మీసం మీద బ‌ల్లి ప‌డితే క‌ష్టాలు వ‌స్తాయి.
పై పెద‌వి మీద ప‌డితే ఇత‌రుల‌తో గొడ‌వ‌లు ప‌డ‌తార‌ని, కింది పెద‌వి మీద ప‌డితే లాభం క‌లుగుతుందని.. రెండు పెద‌వుల మీద ప‌డితే మృత్యువు క‌లుగుతుంద‌ని ఋషులు బ‌ల్లి శాస్త్రంలో తెలియ‌జేశారు.
అదే విధంగా మెడ మీద బ‌ల్లి ప‌డితే పుత్రుడు పుడ‌తాడు.
కంఠం మీద బ‌ల్లి ప‌డితే శ‌త్రుభ‌యం వెంటాడ‌తుందని పెద్ద‌లు తెలియ‌జేశారు.
పురుషుల కుడి భుజం మీద బ‌ల్లిప‌డితే క‌ష్టాలు వ‌స్తాయ‌ని, ఎడ‌మ భుజం మీద బల్లి ప‌డితే సంఘంలో మ‌ర్యాద త‌గ్గుతుంద‌ని బ‌ల్లిశాస్త్రం మ‌న‌కు తెలియ‌జేస్తోంది.
బ‌ల్లి పురుషుల వీపుపై ప‌డితే విజ‌యం క‌లుగుతుంది
మ‌ణిక‌ట్టు మీద ప‌డితే అలంకార ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.
చేతివేళ్ల మీద బ‌ల్లి ప‌డితే ఆక‌స్మికంగా బంధు మిత్రులు వ‌స్తార‌ని, అర చేతిలో ప‌డితే ధ‌న లాభం కలుగుతుంద‌ని బ‌ల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పురుషుల పొట్ట మీద బ‌ల్లి ప‌డితే సంతానం క‌లుగుతుంద‌ని, మోకాళ్ల మీద ప‌డితే వాహ‌న లాభం క‌లుగుతుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు.
తొడ భాగంలో బ‌ల్లి ప‌డితే విష కీట‌కాల వ‌ల్ల ప్రాణ హాని క‌లిగే అవ‌కాశం ఉంటుంది.
పాదాల మీద ప‌డితే క‌ష్టం వ‌స్తుందని పాదాల వెన‌క ప‌డితే ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంద‌ని, పాదాల వేళ్ల మీద ప‌డితే అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

దోషం తొలగాలంటే..

బ‌ల్లిమీద ప‌డిన వెంట‌నే త‌ల‌స్నానం చేసి ఇష్ట దైవానికి దీపారాధ‌న చేయాలి. అలాగే రాళ్ల ఉప్పును నైవేద్యంగా స‌మ‌ర్పించి చెడు జ‌ర‌గ‌కూడ‌దు అని ప్రార్థిస్తే దోషం తొల‌గుతుందని పండితులు అంటున్నారు…అలాగే కంచిలో వెండి, బంగారు బ‌ల్లుల‌ను తాకినా లేదా ఆ బ‌ల్లులు తాకిన వారిని మ‌నం తాకిన కూడా దోషం తొల‌గిపోతుంద‌ని.. బ‌ల్లిశాస్త్రం మ‌న‌కు తెలియ‌జేస్తోంది.
ఇవన్నీ.. ఏంట్రా సోదిలా ఉంది అనుకోవచ్చు.. బల్లి శాస్త్రంలో ఏదైతో ఉందో అదే మీకు క్లియర్‌గా అందించాం.. నమ్మడం, నమ్మకపోవడం మన వ్యక్తిగత అంశం.. !! ఏమంటారు..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version