అదృష్టం, ఐశ్వర్యం కలగాలంటే… ఈ గింజల్ని పూజ గదిలో పెట్టండి..!

-

చాలామంది వాళ్ళ ఇంట్లో వివిధ రకాల పద్ధతులే పాటిస్తూ ఉంటారు. నిజానికి మనం చేసే పూజ కానీ మనం ఇంట్లో వస్తువులను పెట్టే దిక్కు కానీ ఎంతో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరం చేయడానికి చాలా మంది రకరకాల టిప్స్ ని పాటిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆచారాలని పాటించడం లేదు కానీ నమ్మే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు దాని వలన చక్కటి ప్రయోజనాలని పొందుతున్నారు.

గురువింద గురించి మీకు తెలిసే ఉంటుంది. గురువింద గింజలు బాగా సహాయం చేస్తాయి. ఈ గింజలని పూర్వం బంగారాన్ని తూచడానికి ఉపయోగించేవారు. అలానే గురివింద గింజల ఆకు తిన్నాక నోట్లో రాయిని వేసుకుని నవలడానికి చూస్తే అది ఈజీగా నలిగిపోయదట. దీపావళి టైంలో అయితే గురువింద గింజలని తీసుకుని లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అక్షయ తృతీయ రోజు కూడా లక్ష్మీదేవిని వీటితో ఆరాధిస్తారు. అయితే గురువింద గింజల్ని మీరు ఈ విధంగా పూజ గదిలో పెడితే చక్కటి ఫలితాలను పొందొచ్చు.

ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో గురివింద గింజల్ని వేసి కుంకుమతో కలిపి బీరువాలో పెడితే ధన లాభం కలుగుతుంది. పసుపు రంగు గింజలు గురు గ్రహదోష నివారణకు ఉపయోగించవచ్చు. శుక్రదోష నివారణకు తెలుపు రంగు, కుజ గ్రహ దోషానికి ఎరుపు రంగు గింజలు, శని గ్రహ దోషాలకి నలుపు రంగు గింజల్ని ఉపయోగిస్తే మంచిది. బుధ గ్రహ దోష నివారణకు ఆకుపచ్చ గింజల్ని ఉపయోగించాలి. గ్రహదోషం ఉన్నవాళ్లు గింజలని చేతికి కంకణంగా చేయించుకుని వేసుకుంటే కూడా చక్కటి ఫలితాలని పొందవచ్చు. నరదిష్ఠి గ్రహ దోషాలు ఇలా పోతాయి. పూజ గదిలో గురివింద గింజలు ఉంచితే అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version