ఆ తప్పుల వల్లే సమంత మయోసిటీస్ బారిన పడిందా..?

-

తెలుగులో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నది. అయితే సమంత ఆరోగ్యం ఇలా అవ్వడానికి ముఖ్య కారణం ఆమె చేసిన రెండు తప్పులే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చేజేతులారా ఆమె ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సమంత ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగుతున్నది. ఫిట్ గా కనిపించడం కోసం సమంత ఎక్కువగా వర్కౌట్ లు చేస్తూ వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. అయితే సమంత అతిగా వర్కౌట్ లు చేస్తారని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉన్నది. సమంత వర్కౌట్ కు సంబంధించిన పలు వీడియోలు,ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాము. మరొకవైపు నాగచైతన్యత విడాకుల తర్వాత సమంత చాలా డిప్రెషన్కు గురైందని వార్తలు కూడా వినిపించాయి. దీంతో సమంత చాలా అప్సెట్ అయ్యిందని కూడా చెప్పవచ్చు. తర్వాత కొన్ని నెలల పాటు సినిమా షూటింగ్లకు కూడా దూరంగా ఉంటూ ఉండేది.

ఈ రెండు కారణాల వల్ల సమంత ఆరోగ్యం ఇలా అయ్యిందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. సమంత ఇకనైనా జిమ్ వర్కౌట్లను కాస్త తగ్గించి సరైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండమంటూ సలహా ఇస్తూ ఉన్నారు అభిమానులు. అతిగా వ్యాయామాలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు కొంతమంది అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. సమంత నటిస్తున్న చిత్రాలలో యశోద సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత ఒక్కో చిత్రానికి సమంత రూ.4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ప్రస్తుతం సమంత గురించి ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version