నేడు హైదరాబాద్‌కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్​లో ఉత్సాహంగా సాగుతోంది. నేడు శంషాబాద్ మాతా ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర జీహెచ్​ఎంసీ పరిధిలోకి ప్రవేశించి గగన్​పహాడ్​కు చేరుకొని, అక్కడి నుంచి ఏజీ కాలేజ్​ మీదగా ఆరామ్​ఘర్​వైపు సాగింది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు జైరాం రమేశ్​తో పాటు రాష్ట్ర నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. తాడ్ బన్ లెగెసి ప్యాలెస్​ చేరుకున్న రాహుల్ గాంధీ మధ్యాహ్నం వరకు ప్యాలెస్​లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. తరవాత సాయంత్రం 4 గంటలకు పురాణాపూల్ నుంచి పాదయాత్రను మళ్లీ మొదలు పెట్టనున్నారు.

రాత్రి 7 గంటలకు నెక్లెస్‌ రోడ్డు చేరుకోనున్న రాహుల్.. అక్కడ జరగనున్న కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాహుల్‌గాంధీ యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు హైదరాబాద్​ రానున్న ఖర్గే.. సాయంత్రం 4 గంటలకు రాహుల్​తో కలిసి జోడో యాత్రలో పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గం.కు నెక్లెస్ రోడ్‌లో నిర్వహించనున్న భారత్ జోడో కార్నర్ మీటింగ్​కు హాజరవనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version