నా పేరు మిస్టర్ లూయిస్. నేను మీ దేశంలో సహాయక చర్యల కోసం కొంత మొత్తం దానం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ మెయిల్ కి మీరు మిగిలిన వివరాల కోసం సంప్రదించండి. అంటూ ఒక ఈ మెయిల్ తో కూడిన మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన ఒక వ్యక్తి వెంటనే తన మొబైల్ లోని తన వ్యక్తిగత ఈ మెయిల్ తో మెసేజ్ చేసాడు. పూర్తి వివరాలు తెలుసుకుని ఇతని బ్యాంకు ఖాతా కూడా అతనికి పంపాడు.
ఫోన్ నెంబర్ కూడా పంపించాడు. ఒక వెబ్ సైట్ లాగిన్ అవ్వండి. అందులో మీరు నమోదు కాగానే మీకు నగదు జమ అవుతాయి అని చెప్పాడు. వెంటనే చెప్పింది చేసాడు ఇవతలి వ్యక్తి. ఓటీపీ వచ్చింది ఎంటర్ చేసాడు. ఖాతాలో ఉన్న 42 వేలు డెబిట్ అని మెసేజ్ వచ్చింది. అవతలి వ్యక్తి నుంచి స్పందన రావడం లేదు. తీరా అర్ధమైంది నేను 42 వేలు పోగొట్టుకున్నా అని. కాబట్టి ఇలాంటి సొల్లు మెసేజ్ లు దయచేసి ఎవరూ నమ్మవద్దని మనలోకం తరుపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.