ఇన్కమింగ్ కాల్స్ ని ఇలా కూడా ఆపవచ్చు తెలుసా….?

-

కొన్ని కొన్ని సార్లు ఇన్కమింగ్ కాల్స్ కి జవాబు ఇవ్వడం కష్టమైపోతుంది. ఏదైనా పనిలో ఉన్నా, సినిమా కి వెళ్ళినా, ఫ్రెండ్స్ తో పార్టీలకి వెళ్ళినప్పుడు మనం ఇన్కమింగ్ కాల్స్ కి ఆన్సర్ చెయ్యము. అయితే అటువంటి సమయం లో ఫ్లైట్ మోడ్ లో ఉంచకుండా కాల్స్ ని ఎలా నిలిపివేయవచ్చు అనేది చూద్దాం…!

మొదటి పద్దతి:

మొదట కాల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. అక్కడ కాల్ ఫార్వార్డ్ ఆప్షన్ ని ఎంచుకోండి. ఇప్పుడు మీకు అక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. Always Forward’, ‘Forward When Busy’ and ‘Forward When Unanswered’. ఆల్వేస్ ఫార్వర్డ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి enable బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ నెంబర్ కి ఇన్కమింగ్ కాల్స్ ని ఆపచ్చు. ఇంటర్నెట్ ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు.

రెండవ ఆప్షన్:

స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్లోకి వెళ్లి సౌండ్ మీద క్లిక్ చేయండి. డోంట్ డిస్టర్బ్ మీద క్లిక్ చేసి కాల్ మీద క్లిక్ చేయండి. కాల్ మీద క్లిక్ చేశాక… Do Not Allow Any Calls from the popup menu అక్కడ allow repeat callers అని ఉంటుంది దాన్ని ఆఫ్ చేయండి.

మూడవ ఆప్షన్ :

దీనికోసం మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి కాల్ బేరియర్ లోకి వెళ్ళండి. ఇప్పుడు అక్కడ ఆల్ ఇన్కమింగ్ కాల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి.. అక్కడ పాస్వర్డ్ ని క్లిక్ చేయండి. దీని పాస్వర్డ్ 0000, 1234 ఇప్పుడు టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version