కేఆర్ విజయ కూతురు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటితరం హీరోయిన్లలో అంజలీదేవి, భానుమతి అయితే ఆ తర్వాత హీరోయిన్లలో జమున ,సావిత్రి అంతటి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక వారితో సమానంగా పేరు సంపాదించుకున్న కే.ఆర్ విజయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మద్రాస్ లో ఒక టీవీ షోలో కె ఆర్ విజయను చూసిన నటుడు జెమినీ గణేషన్ నువ్వు స్టార్ హీరోయిన్ అవుతావని ప్రోత్సహించారు. అలా కేఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన కర్పగం సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది.

అందం, అభినయంతో తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరిసన నటించిన కేఆర్ విజయ సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగులో దేవత పాత్రలలో ఎక్కువగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇకపోతే ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించిన వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఈ క్రమంలోనే కేఆర్ విజయ సోదరి, అలాగే ఆమె కూతుర్లు కూడా వెండితెరపై నటీమణులుగా స్థిరపడ్డారు. కె ఆర్ విజయ సోదరి కె.ఆర్ సావిత్రి మాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటే కె.ఆర్ సావిత్రి.. ఇద్దరు కూతుర్లు అనూష, రాగసుధా ఇద్దరు కూడా ఇండస్ట్రీలో నటీమణులుగా పేరు సంపాదించుకున్నారు.

విజయ కూతురు అనూష మాలివుడ్లోకి తన 13వ ఏటనే అడుగు పెట్టింది . ఆమె టాలెంట్ చూసి పలువురు దర్శకులు హీరోయిన్గా అవకాశాలు ఇచ్చారు. తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటించిన ఈమె.. తెలుగులో గోల్మాల్ గోవిందం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు తో పాటు మరికొన్ని చిత్రాలలో నటించింది. అయితే ఇప్పటికీ కూడా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇంకొన్ని సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version