అవసరం అయితే తెలంగాణ కోసం చస్తా కానీ అవినీతి చేయను అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏసీబీ ప్రశ్నలన్నింటికీ తన వద్ద సమాధానాలు ఉన్నాయని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి పని చేశానని తెలిపారు. ఒక్క పైసా అవినీతి చేయలేదని మరోసారి వెల్లడించారు.
“మా ప్రభుత్వం ఉన్నపుడు మా బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్ట్ కోసం పని చేయలేదు. మంత్రిగా నేను క్యాబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. నేను రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కాదు. నేను నికార్సైన తెలంగాణ బిడ్డను.. నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు” అని కేటీఆర్ పేర్కొన్నారు.