క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఈ రెండు పోషకాలే అని మీకు తెలుసా..?

-

క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని అందరికీ తెలిసిందే.. ఇక క్యాన్సర్ అనేది శరీరంలోని ఏదైనా అవయవం లేదా కణజాలం లో మొదలయ్యే వ్యాధుల యొక్క పెద్ద సమూహం అని చెప్పవచ్చు. అయితే శరీరంలో అసాధారణ కణితులను అనియంత్రితంగా పెరిగినప్పుడు.. క్యాన్సర్ సాధారణ పరిధిని దాటి సమీపంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చే దశను మెటాస్టాటిస్ అని అంటారు. ఇక ఈ దశలోనే మనిషి మరణం చెందుతారు. ముఖ్యంగా క్యాన్సర్ కు ఇటీవల కాలంలో చికిత్స అందుబాటులోకి ఉన్నప్పటికీ.. చాలా మంది సరైన అవగాహన లేక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.

2018లో 9.6 మిలియన్ల మంది కేవలం క్యాన్సర్ బారినపడి మరణించగా.. ఇక ప్రస్తుతం ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. అయితే ఇంత మంది మరణించడానికి గల కారణం కూడా లేకపోలేదు. ఇక క్యాన్సర్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. పురుషులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లు ప్రోస్టేట్, ఊపిరితిత్తులు , పెద్దప్రేగు, కడుపు, కాలేయ క్యాన్సర్ లు. ఇక అదే సమయంలో ఊపిరితిత్తులు, గర్భాశయ, రొమ్ము, పెద్దపేగు, థైరాయిడ్ క్యాన్సర్లు మహిళలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక మనిషికి క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు కూడా ఉండొచ్చు.

ముఖ్యంగా స్వీడన్ లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ న్యూట్రీషియన్ మెటబాలిజం అండ్ ఇన్ఫ్లమేషన్ లో పీహెచ్డీ చేసిన పరిశోధకుడు పెడ్రో కారేరా పాస్టోస్ ప్రకారం.. ఫోలేట్ అలాగే విటమిన్ బి లోపం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన నిరూపించారు. ఇకపోతే ఫోలేట్ లోపాన్ని నివారించడానికి ఒక వ్యక్తి ప్రతిరోజు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఫోలేట్ లోపం వల్ల కండరాల బలహీనత, మలబద్ధకం, అతిసారం , రుచి కోల్పోవడం, తిమ్మిరి, ఆటిజం, అలసట, గొంతు నొప్పి, నరాల సమస్యలు, నాలుక వాపు లాంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి.

ఇక బి విటమిన్ లో ఎనిమిది రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి లోపం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి శరీరంలో ఈ రెండు పోషకాల లోపం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version