ఒత్తిడిలో రకాలు కూడా ఉన్నాయి మీకు తెలుసా..?

-

రోజు రోజుకి ఒత్తిడి ఎక్కువైపోతోంది…పనుల తో బిజీ బిజీగా ఉండడం తో రెస్ట్ తీసుకోవడం కూడా కష్టం అయిపోతోంది. అలానే ఈ రోజుల్లో మనిషి మానసికంగా లేదా, శారీరకంగా అయినా ఏదో ఓ పని చేయక తప్పడం లేదు. పని ఒత్తిడి నుండి బయట పడాలంటే మాత్రం తప్పక రెస్ట్ తీసుకోవాలి. విశ్రాంతి లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కొందరు నిపుణులు చెబుతున్నారు.. మరి ఇప్పుడే వాటి గురించి తెలుసుకోండి.

ముందు ప్రతీ ఒక్కరికి శారీరక విశ్రాంతి కావాలి. శారీరక విశ్రాంతి అంటే ఏమిటి అనే విషయానికి వస్తే… కొంచెం సేపు పడుకోవడం లేదా విశ్రాంతిగా ఉంటూ బాగా ఇష్టమైన పని చేస్తూ ఉండాలి. అదే భావోద్వేగ విశ్రాంతి అంటే… మనసులో ఉండే భావోద్వేగాలను పూర్తిగా కట్టిపెట్టాలి. లేదా ఆప్తులైన వారితో పంచుకోవడం కూడా మంచిది అని వైద్యులు అంటున్నారు. ఇక ఇంద్రియాలపై పడే ఒత్తిడిని దూరం చేసుకోవడమే సెస్సరీ రెస్ట్ అంటారు. ఇందుకోసం మనం మన ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటికి దూరంగా ప్రశాంతంగా ఉండటం.

అలానే సామాజిక విశ్రాంతి కూడా ఉంది. ఇది ఏమిటంటే… సోషల్ రెస్ట్. మనల్ని మనం పరిశీలించుకోవడం అన్నమాట. మన దగ్గరి వ్యక్తినో, గురువు గారి దగ్గరకు వెళ్లి మాట్లాడటం చేయాలట. అలా చేస్తే ఒత్తిడి నుండి బయపడగలం. అలానే ఎప్పుడు సమస్య కలిగిన కృంగిపోతూ ఉండకూడదు. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలానే మొబైల్ ఫోన్స్ తో గడపడం వల్ల ఒత్తిడి తగ్గదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, కొత్త ప్రదేశాలకి వెళ్లడం వంటివి చేస్తే ఈ ఒత్తిని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ పద్ధతులని అనుసరించండి. ఒత్తిడి నుండి యిట్టె బయట పడిపోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version