ప్రతి ఒకరు ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ ని ఉపయోగిస్తున్నారు వాషింగ్ మిషన్ ని పెట్టుకునేటప్పుడు బాల్కనీలో కంఫర్ట్ గా ఉంటుందని వాషింగ్ మిషన్ ని బాల్కనీలో పెడుతున్నారు. మీరు కూడా మీ వాషింగ్ మిషన్ ని బాల్కనీ లోనే పెడుతున్నారా అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. వాషింగ్ మిషన్ ని బాల్కనీలో పెట్టినప్పుడు కచ్చితంగా ఈ విషయాలని గుర్తు పెట్టుకోండి.
లేకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. వాషింగ్ మిషన్ సరైన స్థలంలో ఉంచాలి. వాషింగ్ మిషన్ బాల్కనీలో ఉంచొచ్చు కానీ బాల్కనీలో పెట్టేటప్పుడు ఒక మూలలో ఎత్తైన స్థలాన్ని ఎంచుకుని అక్కడ మాత్రమే మీరు పెట్టండి. ఎప్పుడైనా బాల్కనీలో వర్షం నీరు నిండినప్పుడు ఆ నీరు మిషన్ ని తాకదు. కాబట్టి ఎత్తైన చోటున పెట్టాలి. వాషింగ్ మిషన్ బాల్కనీలో ప్రత్యక్ష సూర్యకాంతి లేదంటే వర్షపు నీరు పడకుండా చూసుకోవాలి.
వీటి వలన వాషింగ్ మిషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బాల్కనీకి చుట్టూ మీరు దోమతెరని పెట్టారంటే కీటకాలు వంటివి అందులో పడవు. బాల్కనీలో వాషింగ్ మిషన్ పెట్టినప్పుడు వైరింగ్ మీద దృష్టి పెట్టండి. ఒక్కొక్కసారి వైరింగ్ పాడయ్యే ప్రమాదం ఉంది. అలానే బాల్కనీలో వాషింగ్ మిషన్ పెట్టేటప్పుడు రెయిన్ రెసిస్టెన్స్ ఇన్స్టాల్ చేయండి ఇలా చేయడం వలన మీరు డైరెక్ట్ గా వాషింగ్ మిషన్ మీద పడదు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ బాగుంటుంది. లేకపోతే ఇబ్బంది పడతారు.