వైఎస్ భారతిపై క్షణికావేశంలో అలా మాట్లాడా? నన్ను క్షమించండి : కిరణ్ చేబ్రోలు

-

YS భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మరో వీడియోను విడుదల చేశారు.ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని టీడీపీ అధిష్టానం వెల్లడించింది.

చేబ్రోలు కిరణ్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీచేసింది. టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై పోలీసులుకేసు నమోదు చేశారు. మరికాసేపట్లో గుంటూరులో కిరణ్‌ను అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే కిరణ్ తన వీడియో సందేశంలో .. క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని.. తనను క్షమించాలని కోరాడు. కాగా, కిరణ్‌పై టీడీపీ అధిష్టానం కనికరిస్తుందా? లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news