వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి పోలీసులు బిగ్ షాకిచ్చారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఫైనల్‌గా లుకౌట్ నోటీసుల అస్త్రం ప్రయోగించారు.

కాకాణితో పాటు మరో నలుగురు నిందితుల ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు సెర్చింగ్ చేస్తూనే ఉన్నాయి. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసుల విచారణస్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం.