హఠాత్తుగా మీ లవర్ మీ నుండి దూరంగా వెళ్లిపోయారా..? కారణాలివ్వవచ్చు..!

-

చాలా మంది ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే చాలాకాలం ప్రేమలో ఉండి హఠాత్తుగా విడిపోవడం కూడా జరుగుతుంది. ప్రేమలో ఫెయిల్యూర్ అనేది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అందరి ప్రేమ అనుకున్నట్టు సక్సెస్ అవ్వదు.

అయితే అప్పటి వరకు ప్రేమించుకున్న వాళ్ళు హఠాత్తుగా ఎందుకు విడిపోతారు అని మనకి అనిపిస్తూ ఉంటుంది, మనస్తత్వ శాస్త్రవేత్తలు దానికి గల కారణాలు గురించి చెప్పారు. మరి ఆలస్యం ఎందుకు ప్రేమలో హఠాత్తుగా విడిపోవడానికి గల కారణాలు చూద్దాం.

తరచూ గొడవలు అవ్వడం:

ఒకవేళ కనుక తరచుగా ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉంటే వాళ్లు ఆ బంధానికి స్వస్తి పలకాలని అనుకుంటారు. గొడవల వల్ల కలిగే ఒత్తిడి తో విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. దానితో చెప్పాపెట్టకుండా హఠాత్తుగా విడిపోతారు.

ఇంకొకరు నచ్చవచ్చు:

ఒకవేళ కనుక ప్రేమలో వున్నా మరొకరు అంతకంటే బెస్ట్ అని వాళ్ళకి అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోతారు అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి ఇలా జరిగినా సరే మధ్యలో వదిలేసి వెళ్లి పోవడం జరుగుతుంది.

సన్నిహితంగా ఉండటం నచ్చకపోవచ్చు:

మీతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమెకి లేదా అతడికే రొమాంటిక్ గా అనిపించకపోయినా విడిపోవాలి అనిపిస్తుంది. దీంతో హఠాత్తుగా నిర్ణయం తీసుకుంటారు.

సొంత ఎదుగుదల:

కొంతమందికి జీవితంలో ఏదో చేయాలని ఉంటుంది. అలాంటి వాళ్లకి ప్రేమ అడ్డంకిగా మారిందని సొంత ఎదుగుదల కోసం ప్రేమని విడిచిపెట్టి వెళ్ళిపోతారు.

మంచి నిర్ణయం కాదని భావించినా:

ఒకవేళ కనుక వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు అని అనిపిస్తే హఠాత్తుగా వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్లి పోయే అవకాశం ఉంటుంది ఈ కారణాల వల్ల చాలా మంది ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్లి పోవడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version