గత వారం రోజులుగా రెండు మూడు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపిస్తున్న… వికాస్ దుబే ని నేడు మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయినీలో అరెస్ట్ చేసారు. అతను మహంకాళి ఆలయంలో దైవ దర్శనం కోసం వెళ్ళగా అక్కడ అతన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అతని వద్ద ఆయుధం ఏమీ లేకపోవడంతో పోలీసులు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పట్టుకున్నారు.
అయితే ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అతన్ని పట్టుకున్నారా లేక అతనే లొంగిపోయాడా అనే దాని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. అతను దొరికిన విధానం అసలు పోలీసులు పట్టుకున్నా సరే ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా ఉన్నాడు అనే విషయం స్పష్టంగా వీడియో లు చూస్తే అర్ధమవుతుంది. అయితే కాల్చి చంపేస్తారు అని అతను భయపడి దొరికిపోయాడు అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను బహిరంగ ప్రదేశాలకు అసలు ఎందుకు వస్తాడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.