ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్ మ‌రిచిపోయారా ? ఇలా చెక్ చేసుకోండి !

-

ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది త‌మ ఫోన్ల‌లో ఒక‌టి క‌న్నా ఎక్కువ సిమ్‌ల‌ను వాడుతున్నారు. రెండు, మూడు ఫోన్ నంబ‌ర్ల‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. దీని వ‌ల్ల త‌మ ఆధార్ కార్డుకు ఏ నంబ‌ర్ లింక్ అయి ఉందో తెలుసుకోవ‌డం క‌ష్టంగా మారుతోంది. మ‌రోవైపు ఆధార్‌కు మొబైల్ నంబ‌ర్ అప్‌డేట్‌గా లేక‌పోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే కింద తెలిపిన స్టెప్స్ ఫాలో అయితే మీ ఆధార్ కార్డుకు అటాచ్ అయి ఉన్న మొబైల్ నంబ‌ర్‌ను ఇట్టే తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఆ స్టెప్స్ ఏమిటంటే…

1. ముందుగా ఆధార్ వెబ్‌సైట్ uidai.gov.in లోకి లాగిన్ అవ్వాలి.

2. ఈ-మెయిల్ ద్వారా ఆధార్ వెరిఫై చేసుకోవాలి. అందుకు గాను సైట్‌లో ఉండే ఆప్ష‌న్ల‌లో ఈ-మెయిల్ ద్వారా ఆధార్ వెరిఫికేష‌న్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

3. అక్క‌డ సూచించ‌బ‌డిన వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

4. ఆధార్ కార్డు నంబ‌ర్‌, సెక్యూరిటీ కోడ్‌ల‌ను ఎంట‌ర్ చేయాలి.

5. ఈ-మెయిల్‌కు ఆధార్ ఓటీపీ వ‌స్తుంది.

6. దాన్ని ఆధార్ సైట్‌లో ఎంట‌ర్ చేసి ఈ-మెయిల్‌ను వెరిఫై చేయాలి. అనంత‌రం మీ ఆధార్ కార్డు వివ‌రాలన్నీ తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అక్క‌డే ఆధార్‌కు రిజిస్ట‌ర్ అయి ఉన్న మొబైల్ నంబ‌ర్‌ కూడా క‌నిపిస్తుంది.

దీంతో మీ ఆధార్ నంబ‌ర్‌కు ఏ మొబైల్ లింక్ అయి ఉందో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version