రెడ్ హ్యాండెడ్‌గా డీజిల్ దొంగలు పట్టుబడ్డారు. పట్టపగలే పార్కింగ్ చేసిన లారీల నుంచి వీరు డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు వెహికిల్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శనివారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం..కరీంనగర్ పట్టణ ప్రాంతంలో గత కొంత కాలంగా పార్కింగ్ చేసిన వాహానాల్లో సామగ్రి, డీజిల్ దొంగతనం జరుగుతోంది.
ఈ చర్యల వలన లారీ యజమానులు,డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం లారీలో డీజిల్ దొంగతనం చేస్తుండగా ఓనర్ ఇద్దరు దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారి కాళ్లు, చేతులు తాడుతో బంధించి దేహశుద్ది చేశారు. వారిద్దరికి దేహశుద్ధి చేస్తున్న వీడియోను నెట్టింట పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.