ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ ( Mutual Funds ) లో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి ఎక్కువవుతుంది. మార్కెట్ రిస్కులకు లోబడి ఉండే ఈ పెట్టుబడుల్లో డబ్బులు పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దానిలో భాగంగా కొన్ని ప్రశ్నలు కలుగుతున్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? అనేది చాలామందిలో ఉన్న సందేహం. ప్రస్తుతం వీటి మధ్య తేడాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డైరెక్ట్ ప్లాన్
దీన్ని ఫండ్ హౌస్ డైరెక్టుగా ఇస్తుంది. అంటే ఇక్కడ నువ్వు తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ స్కీము డైరెక్టు ఫండ్ హౌస్ నుండే వస్తుంది.
రెగ్యులర్ ప్లాన్
ఇక్కడ మీరు తీసుకునే ప్లాన్ ఫండ్ హౌస్ నుండి కాకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఇండివిడ్యుయల్ అడ్వైజర్స్, బ్యాంకుల మొదలైన వాటి నుండి వస్తాయి.
డైరెక్ట్ ప్లాన్లలో ఎలాంటి కమీషన్ ఉండదు. అదే రెగ్యులర్ ప్లాన్ వచ్చేసరికి కమిషన్ ఉంటుంది. అందువల్ల ఎక్స్ పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ పెన్స్ రేషియో అంటే ఫండ్ నడిపించడానికి ఫండ్ మేనేజర్ తీసుకునే ఛార్జ్ అని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ ప్లాన్ లో ఎలాంటి మధ్యవర్తులు లేరు కాబట్టి ఎక్కడా అదనంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అదే రెగ్యులర్ ప్లాన్ లో మధ్యవర్తులకి కమీషన్ ఉంటుంది.
డైరెక్ట్ ప్లాన్ లో నెట్ అసెట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
గమనిక: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు జాగ్రత్తగా చదవండి.