షావోమీ స్మార్ట్‌వాచ్ డిజైన్, ఫీచర్లు వ‌చ్చేసాయి..

-

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ స్మార్ట్‌వాచ్‌పై పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ వాచ్‌కు సంబంధించిన డిజైన్‌ను బయటపెట్టింది. దీనిని చూస్తుంటే యాపిల్ వాచ్ నుంచి స్ఫూర్తి పొంది ఈ డిజైన్‌ను తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటి ఫొటోలతోపాటు స్మార్ట్‌వాచ్‌కు చెందిన కొన్ని ఫీచర్లను కూడా షావోమీ బయటపెట్టింది. 3డి కర్వ్‌డ్ గ్లాస్ ఉన్న ఈ వాచ్‌లో కుడివైపున బటన్ ఉంది. దాని కిందే మైక్రో ఫోన్ ఉంది. ఫొటోను బట్టి దీనిని ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉన్నట్టు అర్థం అవుతోంది.

అలాగే, ఇంటర్నెట్, ఈ-సిమ్ కనెక్టివిటీకి కూడా అవకాశం ఉన్నట్టు సమాచారం. షావోమీ వాచ్‌లో జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్, వై-ఫై కనెక్టివిటీ, అతిపెద్ద బ్యాటరీ, స్పీకర్ ఉన్నాయి. ఈ వాచ్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ వియర్ 3100ను ఉపయోగించారు. ఇంతకుమించిన వివరాలు వెల్లడి కాలేదు. అయితే, వియర్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌వాచ్‌ను తీసుకురాబోతున్నట్టు కంపెనీ ఇటీవల లీకులిచ్చింది. త్వరలో షావోమీ నుంచి రాబోతున్న ఎంఐ వాచ్ ఇదే అయి ఉంటుందన్న ఊహగానాలు కూడా మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version