కాంగ్రెస్ కష్టాలు..మళ్ళీ మిస్?

-

ఉమ్మడి ఏపీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…తెలంగాణ వచ్చాక మాత్రం రెండుసార్లు అధికారానికి దూరమైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్నా సరే కాంగ్రెస్ ని తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించడం లేదు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇలా రెండు సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ…ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే దిశగా పనిచేస్తుంది. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో దూకుడుగా పనిచేస్తుంది.

అయితే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటంలో కాంగ్రెస్ దూకుడుగా ఉంది గాని…క్షేత్ర స్థాయిలో బలపడటంలో వెనుకబడే ఉందని తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఆరా సర్వేలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది..టీఆర్ఎస్-38 శాతం, బీజేపీ-30 శాతం, కాంగ్రెస్ -23 శాతం ఓట్లు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం దక్కడం కలే అని అర్ధమవుతుంది.

కానీ 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది…కానీ ఈ సారి మాత్రం మూడో స్థానానికి పరిమితమవుతుందని అర్ధమవుతుంది. వాస్తవానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తరువాత కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది గాని, కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం.2019 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి చెందడం, తక్కువ ఓట్లు రావడం లాంటి అంశాలు మైనస్ గా మారాయి.

పైగా బీజేపీ సత్తా చాటడంతో.. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కంటే బీజేపీనే ప్రత్యామ్నాయం అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడేలా ఉంది. కానీ ఇంత నెగిటివ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాజిటివ్ ఏంటంటే… ఆ పార్టీకి ప్రస్తుతం 53 నియోజకవర్గాల్లో బలమైన  అభ్యర్ధులు ఉండటం. ఇంకా ఆ బలాన్ని పెంచుకుంటూ వెళితే ఎన్నికల నాటికి ప్రజలు…కాంగ్రెస్ గురించి ఆలోచించవచ్చు. మరి చూడాలి కాంగ్రెస్ భవిష్యత్ ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version