ప్లీనరీ నభూతో న భవిష్యత్తు లా జరిగింది : సజ్జల

-

ప్లీనరీ నభూతో న భవిష్యత్తు లా జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. గురువారం మీడియాతో సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీకి ఉప్పెనలాగా ప్రజలు వచ్చారన్నారు. అంతేకాకుండా.. ప్లీనరీతో టీడీపీ, దత్త పుత్రుడు, టీడీపీ మీడియా చేస్తూ వచ్చిన అబద్దాలన్నీ పటాపంచలు అయ్యాయన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ వాస్తవాం చంద్రబాబుకు మింగుడు పడలేదని, గేమ్ మార్చి స్పీడ్ పెంచి ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాను అధికారంలోనే ఉన్నట్లు భ్రమలు తన చుట్టూ పెట్టుకుంటాడని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు.

కంకర, సిమెంట్, సిమెంట్ వంటివి లేకుండానే చంద్రబాబు హయాంలో నిర్మాణాలు చేసే వాళ్ళేమో అని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. చేతిలో ఏమీ లేకపోయినా మాయాబజార్ సృష్టించగలిగిన వ్యక్తి చంద్రబాబు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు గుప్పించారు. అంతేకాకుంఒడా.. మైనింగ్ శాఖ సమర్ధవంతంగా వ్యవహరించటం వల్లే ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, అవార్డులు వస్తున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version