ఆదిలాబాద్ కారులో 5 సిట్టింగులకు కష్టాలు…?

-

సిట్టింగులకే మళ్ళీ సీట్లు ఇస్తామని…కానీ సరిగ్గా పనిచేయకుండా, అవకాశాలని పోగొట్టుకుంటే తాను ఏం చేయలేనని కేసీఆర్…ఇటీవల శాసనసభపక్షా సమావేశంలో ఎమ్మెల్యేలకు చెప్పిన విషయం తెలిసిందే. అంటే ఎక్కువమంది సిట్టింగులకు ఈ సారి సీటు లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్…సిట్టింగులకే సీటు అని చెప్పి ఎమ్మెల్యేల టెన్షన్ తగ్గించారు. అయితే ఇప్పుడు అలా చెప్పకపోతే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్, ఎమ్మెల్యేలని ఆపడానికి అలా చెప్పి ఉంటారనే ప్రచారం ఉంది.

ఏదేమైనా గాని సిట్టింగులకు సీటు అనే పాలసీ టీఆర్ఎస్ పార్టీకే పెద్ద నష్టం చేకూర్చేలా ఉంది. గతంలో కూడా సిట్టింగులకు సీటు ఇచ్చారు. కానీ అప్పుడు టీఆర్ఎస్ వేవ్ ఉంది..ఆ వేవ్ లో ఎమ్మెల్యేలు గెలిచేశారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. సిట్టింగులకు సీటు ఇస్తే చాలామంది ఓడిపోయేలా ఉన్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగులపై వ్యతిరేకత ఉంది.

ఇలాంటి తరుణంలో మళ్ళీ సిట్టింగులకే సీటు ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి రిస్క్. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి రిస్క్ ఎక్కువ కనబడుతుంది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 9 టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సక్కు కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అంటే 10 సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి.

మరి నెక్స్ట్ ఈ పది మంది సిట్టింగులకు సీట్లు ఇస్తే టీఆర్ఎస్ గెలుస్తుందా? అంటే కష్టమనే చెప్పాలి. నిర్మల్, చెన్నూర్, ఆదిలాబాద్, ముథోల్, సిర్పూర్ స్థానాల్లో సిట్టింగులకు సీట్లు ఇస్తే పెద్ద ఇబ్బంది లేదని తెలుస్తోంది. కానీ ఖానాపూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బోథ్, బెల్లంపల్లి సీట్లు గాని మళ్ళీ సిట్టింగులకు సీట్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీకే ఇబ్బందే అని తెలుస్తోంది. మరి ఈ సారి ఆదిలాబాద్ లెక్కలు ఎలా మారతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version