గేమ్ చేంజర్ మూవీ హీరో రాం చరణ్ 256 అడుగుల కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు దిల్ రాజు మాట్లాడుతూ.. గేమ్ చేంజర్ సినిమా చిరంజీవి చూసి నాకు ఇపుడు కాల్ చేశారు. సంక్రాంతికి గట్టిగా కొడతన్నాం అన్నారు చిరంజీవి. ఈ సినిమాలో చరణ్ లో మెగా, పవర్ ను చూస్తారు. సినిమాలో చరణ్ నట విశ్వరూపం చూస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, పొలిటికల్ లీడర్ పాత్రల్లో చరణ్ సినిమా లో కనిపిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ ను కలవటానికి కూడా ఏపీ వచ్చాను. అమెరికాలో గేమ్ చేంజర్ ఈవెంట్ చేశాం. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ బట్టి ఈవెంట్ నిర్వహణ చేస్తాం. ఆ ఈవెంట్ చరిత్ర సృష్టించాలి.
గేమ్ చేంజర్ తర్వాత ఓజీ మీదకు షిఫ్ట్ అవుదాం. జనవరి 1న గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేస్తాం. తెలుగు సినిమా పుట్టినిల్లు బెజవాడ. సినిమా అంటేనే బెజవాడ. 256 అడుగుల కటౌట్ పెట్టిన మెగా పవర్ స్టార్ అభిమానులకు కృతజ్ఞతలు.. ఇది ప్రపంచ రికార్డు కటౌట్ అని దిల్ రాజు పేర్కొన్నారు.