నూతన సంవత్సర వేడుకల వేళ మార్గదర్శకాలను జారీ చేసారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. డిసెంబరు 31 రాత్రి తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లు నందు చెక్ పోస్ట్‌లు, పికెట్‌లను ఏర్పాట్లు చేసీ రాత్రి 10 గంటల నుండి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించి, తెల్లవారుజామున వరకు కొనసాగుతుంది. వైన్ షాపులు మరియు బార్‌లను ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత సమయంలో మూసివేయాలి. గరుడ వారధి, యూనివర్సిటీ ఫ్లై ఓవర్ లను డిసెంబర్ 31వ తేది రాత్రి 10pm గంటలకు మూసివేయబడును. తిరుపతి పట్టాణములో రోడ్ల పైన మరియు ఫ్లై ఓవర్ పైన నూతన సంవత్సర వేడుకలు నిషిద్దం.
స్పెషల్ డ్రైవ్ లో బ్రీత్ ఎనలైజర్ల కు పట్టుబడిన వ్యక్తులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు పంపడం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సాంస్కృతికంగా కించపరిచేలా అశ్లీల నృత్య కార్యక్రమాలు, డిజే సౌండ్స్, రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించేందుకు అనుమతులు లేవు. నూతన సంవత్సర వేడుకలను సాకుగా చూపి బైక్‌లు, కార్లను రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. జనవరి, సంక్రాంతి పండుగ పర్వదినాల్లో జూదం, మట్కా, కోడి పందాలు, రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. నిర్వహిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు, చేయబడతాయి. బహిరంగ ప్రదేశాలలో మద్యము సేవించి, ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది కలిగించరాదు. అట్లు చేసిన వారి పై తగు చర్యలు తీసుకోనబడుతాయి అని పేర్కొన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ.