దిల్‌ రాజు పెళ్లి ఫోటో.. కొత్త జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజు ..!

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు .. జీవితాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా ఆయన రెండో వివాహాం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వార రీసెంట్ గా తన వివాహానికి సంబంధిన అఫీషియల్ న్యూస్ ని రివీల్ చేశారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు వివాహం ఈ ఆదివారం (మే 10) సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్ లో జరిగింది. నిజామాబాద్ – నర్సింగ్ పల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామీ దేవాలయంలో బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిగింది.

 

అయితే దిల్ రాజు పెళ్ళి చేసుకున్న అమ్మాయి పేరు తేజశ్విని. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దిల్ రాజు వివాహం చేసుకున్నందుకు ఆయనకి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

 

2014 లో దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి వివాహం జరిగింది. అయితే రెండేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత ఆనారోగ్యం తో మరణించిన విషయం తెలిసిందే. ఆ షాక్ తో దిల్ రాజు మానసికంగా చాలా కృంగిపోయారు. దాంతో తన తండ్రికి బాగా తెలిసిన అమ్మాయితోనే హన్షిత ఈ వివాహం కుదిర్చారట. ఈ పెళ్లిని తన చేతుల మీదుగానే జరిపించారు. వివాహ వేడుక నుంచి దిల్ రాజు ఆయన భార్యామణి ఫోటో ఒకటి తాజాగా రిలీజైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version