ఈ నెల 10వ నుంచి డైనోసార్ ఫెస్టివల్

-

దాదాపు ఆరున్నర కోట్ల ఏండ్ల కిందట భూమి మీద తిరిగిన ఈ జంతువులు అంతరించిపోయి చాలా రోజులైంది. వీటి బొమ్మలు అక్కడక్కడా మ్యూజియాల్లో, అమ్యూస్​మెంట్ పార్కుల్లో మాత్రమే కనిపిస్తాయి.అయితే… ‘జురాసిక్ పార్క్’​ సినిమాలో చూసినట్టు పెద్ద పెద్ద డైనోసార్లని చూడాలంటే… చెన్నైలో జరిగే ఈ డైనోసార్ ఫెస్టివల్​కి వెళ్లాలి.చెన్నైలో ఈనెల 10వ తారీఖు నుంచి డైనోసార్ ఫెస్టివల్ జరగనుంది. చెన్నై సెంటర్​లో పది రోజులు జరిగే ఈ ఫెస్టివల్​ని ‘డైనోసార్
ఫెస్టివల్ ఇండియా’ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇంతకుముందు ఢిల్లీ, ముంబైలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ జరిగాయి. అందరికి డైనోసార్లనిదగ్గరగా చూసిన ఎక్స్​పీరియెన్స్ ఇవ్వడమే ఈ ఫెస్టివల్ ఉద్దేశం. మనదేశంలో దాదాపు 16 రకాల డైనోసార్లు ఉండేవట. వాటిలో ఇసిసారస్, రాజసారస్, బ్రాచియోసారస్, టైరనోసారస్ రెక్స్, ట్రైసెరటాప్స్…. వంటి వాటిని ఇక్కడ చూడొచ్చు.

ఈ ఫెస్టివల్​లో 20 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తు, 12 ఇంచుల పొడవు పళ్లు ఉన్న డైనోసార్ల బొమ్మలు ఉంటాయి. ఇక్కడికి వెళ్తే డైనోసార్ల మధ్య తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు బొమ్మ డైనోసార్లతో ఫొటోలు దిగొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి శిలాజాలను వెలికితీసేయాక్టివిటీస్​, జంపింగ్ క్యాజిల్ వంటివి ఉన్నాయి. ఈ ఫెస్టివల్ చూసేందుకు ముందే టికెట్​ బుక్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఫీజు చిన్న పిల్లలకు 710 రూపాయలు. కాలేజీ స్టూడెంట్స్​కు రూ.890. పెద్దవాళ్లకు రూ.1,070. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్​కి 2,950 రూపాయల టికెట్స్ కొనుక్కోవాలి. చెన్నై, చెన్నై చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సోమవారం, శుక్రవారం ఈ ఫెస్టివల్​కి ఎంట్రీ ఉచితం.

Read more RELATED
Recommended to you

Exit mobile version