దర్శకుడు లింగుస్వామికి షాక్​.. ఆరు నెలలు జైలు శిక్ష

-

తమిళ దర్శకుడు లింగుస్వామికి చేదు అనుభవం ఎదురైంది. చెక్​బౌన్స్​ కేసులో ఆయనకు ఓ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ఇదీ జరిగింది.. హీరో కార్తి​, హీరోయిన్​ సమంతతో యెన్ని ఏలు నాల్​ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసింది తిరుపతి బ్రదర్శ్​ ప్రొడక్షన్స్​. దీనికి దర్శకుడు లింగుస్వామి. అయితే ఈయన సినిమా అవసరాలకు పీవీపీ ఫైనాన్స్​ కంపెనీ నుంచి కోటి 35 లక్షలు అప్పుగా తీసుకుని నిర్మాతలకు ఇచ్చారు.

ఆ తర్వాత రూ. 35లక్షలను పీవీపీ ఫైనాన్స్​కు చెక్​ ద్వారా ఇచ్చారు. కానీ అది బౌన్స్ అయింది. దీంతో సదరు కంపెనీ.. ఆయనపై కోర్టులో కేసు వేసింది. దీనిని విచారించిన చెన్నైలోని సైదాబాద్​ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ.. తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ.. లింగుస్వామి మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలిసింది.

కాగా, లింగుస్వామి తెరకెక్కించిన టాలీవుడ్‌ నటుడు రామ్‌ పోతినేని ది వారియర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతిశెట్టి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. జులై 14న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్‌ చిత్రంలో విలన్‌ ఆది పినిశెట్టి- హీరో రామ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రామ్‌.. సత్య అనే పోలీసు పాత్ర పోషించారు. విధుల్లో చేరగానే ఆ ఊరి గ్యాంగ్‌స్టర్‌ గురు (ఆది పినిశెట్టి)పై దృష్టి పెడతాడు. గురుపై విజయం సాధించేందుకు సత్య ఎలాంటి ఆపరేషన్‌ చేపట్టాడు? ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన సవాళ్లేంటి? విజిల్‌ మహాలక్ష్మి (కృతిశెట్టి)గా ఫేమస్‌ అయిన అమ్మాయితో సత్యకి ఉన్న సంబంధమేంటి? అనే విషయాలు ఈ కథలో ఆసక్తికరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version